రాజ్యాంగ స్ఫూర్తితో జ్యోతి హైస్కూల్‌లో నమూనా పార్లమెంట్

26-11-2026 | 07:19pm

జగిత్యాల, నవంబర్ 26 ( విజయ క్రాంతి ): భారత రాజ్యాంగ దినోత్సవాన్ని(Constitution Day of India) పురస్కరించుకుని జగిత్యాలలోని జ్యోతి హైస్కూల్ లో(Jyothi High School) నమూనా పార్లమెంట్ సమావేశాన్ని నిర్వహించారు. పార్లమెంట్ విధులు, ప్రజాస్వామ్య విలువలు, చట్టాల రూపకల్పన, పాఠశాల సమస్యలపై చర్చల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అని ఈ సమావేశంలో ప్రధాన విద్యార్థి నాయకుడు, ఉప ప్రధాన విద్యార్థి నాయకులు,

సాంస్కృతిక కార్యదర్శి, క్రీడా కార్యదర్శి, క్రమశిక్షణ కార్యదర్శులు నాయకత్వం వహించి తెలిపారు. పాఠశాలలోని సమస్యలు, క్రమశిక్షణ, పరిశుభ్రత, క్రీడా సదుపాయాలు, విద్యార్థుల హక్కులు వంటి అంశాలపై చర్చించి పరిష్కారాలను ప్రతిపాదించారు. గతంలో నిర్వహించిన వర్షాకాల పార్లమెంట్ సమావేశంలో విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, ముఖ్యంగా ఆహార పరిశుభ్రత అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు. ప్రస్తుత సమావేశంలో పార్లమెంట్ ప్రశ్నోత్తరాలు, బిల్లుల ప్రవేశపెట్టడం, చర్చలు, ఓటింగ్, చట్టాల ఆమోదం వంటి ప్రక్రియలను నమూనా రూపంలో ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు బియ్యాల హరిచరణ్ రావు, శ్రీధర్ రావు, అజితా రావు, మౌనిక రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు