నిజాయితీ నీ మెచ్చి బహుమతి ఇచ్చిన కలెక్టర్

26-11-2026 | 07:24pm

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కొడిశాల మిట్ట గ్రామంలో(Kodishala Mitta Village) అంగన్వాడీ కేంద్రంలో కలెక్టర్ స్నేహ శబరిష్(Collector Sneha Sabarish) గురువారం తనిఖీకి వెళ్లారు. ఈ సందర్భంగా అంగన్వాడి విద్యార్థికి జరిగిన సంభాషణ.. కలెక్టర్ - మీ అంగన్వాడి ఎప్పుడు తీశారు, టీచర్ ఎప్పుడు వస్తుంది, ఇంతవరకు ఏ ఏ పాఠాలు చెప్పారు.... అని చిన్న పిల్లాడిని అడిగారు.

చిన్నపిల్లడు - స్కూల్ టీచర్ ఈ రోజే వచ్చింది. అంగన్వాడి కేంద్రం ఇప్పుడే తీశారు.ఇన్ని రోజులు రాలేదు. సరిగా పాఠాలు చెప్పరు.. అని నిజాయితీగా సమాధానం చెప్పాడు...

మీ టీచర్ ఇంతవరకు ఏం చదువు చెప్పారు అని కలెక్టర్ ప్రశ్న అడిగారు చిన్నపిల్లడు.. నాకు ఏ, బీ, సీ, డీ లు, అ, ఆ, ఇ, ఈ లు మాత్రమే వచ్చు టీచర్ ఇంతవరకే చెప్పింది అని సమాధానం ఇచ్చాడు. అందుకు కలెక్టర్ పిల్లాడి నిజాయితీని మెచ్చుకొని  బహుమతి ఇచ్చారు ఊహించని బహుమతితో పిల్లాడి ఆనందానికి అవధులు లేవు. ఈ విచిత్రమైన సంఘటన ఏజెన్సీ ప్రాంతమైన గంగారం మండలం కొడిశాల మిట్ట అంగన్వాడీ కేంద్రంలో జరిగింది. పిల్లాడి మాటలు విన్న కలెక్టర్ సంబంధిత అధికారులకు అంగన్వాడీ టీచర్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు