విజయలో రాజ్యాంగ దినం

26-11-2026 | 07:17pm

ఖానాపూర్ ( విజయ క్రాంతి): విజయ ఉన్నత పాఠశాలలో(Vijaya High School) భారత రాజ్యాంగ దినోత్సవాన్నిగురువారం నిర్వహించారు పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు నివాళులు అర్పించారు. మంచిరాల  నాగభూషణం మాట్లాడుతూ విద్యార్థులకు భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం, ప్రజాస్వామ్య విలువలు, ప్రాథమిక హక్కులు, విధులు, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

విద్యార్థులు రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివి రాజ్యాంగ స్ఫూర్తిని చాటారు.ఈ కార్యక్రమంలో పాఠశాల  ఎగ్జిక్యూటివ్ మెంబర్ సీరం విజయలక్ష్మి , ఉపాధ్యాయులు, మరియు  విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు