పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన

28-10-2026 | 02:32pm

ఇల్లెందు టౌన్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC elections) నేపథ్యంలో ఇల్లెందు(Illendu) పట్టణంలో దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు(Voter Registration) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, పాఠశాలలను సందర్శించి అర్హులైన పట్టభద్రులు ఓటరుగా(Graduate Voter) నమోదు చేసుకోవాలని సూచిస్తూ ఫారం-18 అందజేశారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును(Right to vote) వినియోగించుకునేందుకు ముందుగా నమోదు ప్రక్రియ(Registration Process) పూర్తి చేసుకోవాలని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో టీజీబీకేఎస్ రాష్ట్ర నాయకులు సుదర్శనం రంగనాధం, మాజీ ఆత్మ కమిటీ అధ్యక్షుడు భావుసింగ్ నాయక్, అబ్దుల్ జబ్బార్, ఖమృ, ఎస్‌కే గాజీ, లలిత్ పాసి, ఉపేందర్ రావు, తుంగపల్లి మహేష్, బజారు సత్యనారాయణ, మునిగంటి శివ, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు