లైన్ గడ్డ కాలనీలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్
చెన్నూర్, (విజయక్రాంతి):మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని లైన్ గడ్డ కాలనీలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్(Police Community Contact) నిర్వహించారు. సిఐ బన్సీలాల్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్రమంగా గుడుంబా , లిక్కర్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు ఆశ లచ్చన్న , ఆశ కిష్టయ్య లను పట్టుకొని లచ్చన్న వద్ద 3 లీటర్ల గుడుంబాను , కిష్టయ్య వద్ద 90 ML చీప్ లిక్కర్ బాటిల్స్-40 లను స్వాధీన పర్చుకొని వారిపై కేసు నమోదు చేసామని సిఐ తెలిపారు.
సరైన వాహన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు , ఒక ఆటో ను సీజ్ చేసి స్పాట్ చలాన్ విధించామని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనడమే గాక రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. పట్టుబడిన వ్యక్తులపై ఇది వరకే గుడుంబా అమ్మిన రెండు సార్లు కేసులు నమోదు అయ్యినప్పటికి తమ పద్ధతి మార్చుకోకుండా మరల గుడుంబా విక్రయాలు కొనసాగిస్తున్నారన్నారు. పద్ధతి మార్చుకోకుంటే పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందన్నారు.
యువత గంజాయికి అలవాటు పడితే వారి భవిష్యత్తు అంధకారం అవుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలు ఇతర చెడు అలవాట్లకు బానిస కాకుండా జాగ్రత్త వహించాలని అవగాహన కల్పించారు. జీవితం ఎంతో విలువైనది ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువ జరిగుతున్నాయని వివరించారు. పోక్సో చట్టాల గ, సైబర్ నేరల గురించి యువకులకి అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ పట్టణ , ఎస్ ఐ శ్యామ్ పటేల్, సిబ్బంది పాల్గొన్నారు.