బాలికల వసతి గృహంలో హ్యూమన్ రైట్స్ బృందం

13-11-2026 | 07:10pm

విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం.. సమస్యలు, సౌకర్యాలపై ఆరా

మణుగూరు నవంబర్ : 13(విజయక్రాంతి ): హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్మన్ అండ్ ఫౌండర్ బొడ్డపాటి దాసు(Boddapati Dasu, National Chairman and Founder of Human Rights), తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాల్వ సుధాకర్ రావు ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) ఆర్గనైజింగ్ జాయింట్ సెక్రటరీ శ్రీమతి జ్యోతి పూజారి మణుగూరులోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల వసతి గృహాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, వారికి అందుతున్న ఆహార నాణ్యత, పౌష్టికాహారం, వసతి సదుపాయాలు, విద్యాబోధన, భద్రతా ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు ఏవైనా సమస్యలు ఉన్నాయా? అధికారులు కల్పిస్తున్న సౌకర్యాలు సక్రమంగా అందుతున్నాయా? అనే అంశాలపై ఆరా తీశారు.

అలాగే హాస్టల్ పరిసరాలను పరిశీలించి ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఏ విధంగా అందిస్తున్నారు? విద్యార్థినులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందిస్తున్నారా? పారిశుద్ధ్యం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి? అనే విషయాలను పరిశీలించారు.

అనంతరం ప్రిన్సిపాల్ అనిత, వార్డెన్ మరియు సిబ్బందితో సమావేశమై విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించడం, మెరుగైన విద్యాబోధన, వసతి సదుపాయాలు, బాలికల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చర్చించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ జాయింట్ సెక్రటరీ జ్యోతి పూజారితో పాటు మేకల జ్యోత్స్న, లావణ్య పాల్గొన్నారు. హాస్టల్ ప్రిన్సిపాల్ అనిత, సిబ్బంది కవిత, అరుణ, జ్యోతి, జయశ్రీ, విజయకుమారి, సుజాత, స్వప్నిక, దివ్య, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు