ప్రజాకవి కాళోజీ వర్ధంతి వేడుకలు

13-11-2026 | 07:08pm

ముకరంపుర, నవంబర్ 13(విజయ క్రాంతి): ప్రజాకవి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత కాళోజీ నారాయణ రావు(Kalojee Narayana Rao) వర్ధంతి వేడుకలు కరీంనగర్ నగరంలో ఘనంగా జరిగాయి. రేకుర్తిలోని కాళోజీనగర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మరియు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

కాళోజీ  విగ్రహానికి మేయర్, డిప్యూటీ మేయర్‌లతో పాటు కార్పొరేటర్లు, పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు. అనంతరం కాళోజీ సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ తెలంగాణ యాస, భాషను తన రచనలతో ఎలుగెత్తి చాటిన ప్రజాకవి కాళోజి నారాయణ రావు అని, నేటితరాలకు ఆదర్శ ప్రాయుడని తెలిపారు.

పుట్టుక నీది, చావు నీది బతుకంతా దేశానిది అని నినాదించిన.. ప్రజాకవి కాళోజి జీవితం అంతా తెలంగాణ భాష సాహితి సేవ దిశగా సాగిందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు సుధగోని మాధవి- కృష్ణగౌడ్, బోయినపల్లి ప్రవీణ్ రావు, ఎన్నం లక్ష్మీ- ప్రకాష్, గాజ రమ-శివరాం, స్థానిక నాయకులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు