దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌ తనిఖీ

13-11-2026 | 07:12pm

కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ 

కామారెడ్డి, నవంబర్ 13 (విజయక్రాంతి): కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్(Kamareddy DSP Madhusudhan) వార్షిక తనిఖీలలో భాగంగా శుక్రవారం దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌ను(Devunipalli Police Station) సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులను పరిశీలించారు,  కేసుల నమోదు, దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. ప్రతి కేసులో సమగ్రంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహిం చాలని సూచించారు, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్ఐ రంజిత్‌కు సూచించారు.

నేరాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో రాత్రి గస్తీని పటిష్టం చేయాలని అన్నారు, నేరాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీస్ సిబ్బందికి ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి రూరల్ సీఐ  శ్రీధర్ గౌడ్, ఎస్ఐ రంజిత్, ఎస్ఐ బాల్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు