ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఆన్‌లైన్ ప్రారంభం

23-11-2026 | 10:16pm

చర్ల,విజయక్రాంతి: చర్ల మండలం ఆర్. కొత్తగూడెం గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని(Indiramma Life Insurance Scheme) సోమవారం ఘనంగా ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ తుర్రం రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ఇందుల బుచ్చిబాబు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు రూ. 5 లక్షల వరకు జీవిత బీమా రక్షణ లభిస్తుందని ఆయన తెలిపారు. ప్రతి అర్హులైన కుటుంబం ఈ పథకంలో తప్పక పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

అర్హులైన వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో గ్రామ పంచాయతీ వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ శోభారాణి, ఉపసర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు, వార్డు సభ్యులు కారం సుధాకర్, చింతకాయల స్వరూప, కొమరం భద్రయ్య, రుంజ రాజా, దానవాయిపేట మరియు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు