పేదల సంక్షేమం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయం

23-11-2026 | 10:08pm

-పేదలకు సన్న బియ్యం అందించిన ఘనత ప్రజా ప్రభుత్వానికి,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికే దక్కింది

మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జునరావు 

హుజూర్ నగర్, నవంబర్ 23: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్(Municipal Chairman Srinivas), వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జునరావు అన్నారు.సోమవారం పట్టణంలోని గోవిందపురం కమ్యూనిటీ హాల్ వద్ద 8వార్డు కౌన్సిలర్ కోల ఉదయభాను ఉపేందర్ ఆధ్వర్యంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్లను పంపిణీ చేసి మాట్లాడారు... భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సన్న బియ్యం అందించిన ఘనత ప్రజాప్రభుత్వానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికే దక్కిందన్నారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో అర్హత కలిగిన వారందరికీ పింఛన్లు అందించడం జరిగిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం,200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సతీష్, శానిటరీ ఇన్స్ స్పెక్టర్ అశోక్ కుమార్,జ్ఞానయ్య,రాము,పున్నయ్య, కోటమ్మ,రాములు,పున్నయ్య, నాగేశ్వరరావు,తదితరులు, పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు