కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు

23-11-2026 | 10:08pm

మాధవానంద సరస్వతి స్వామి వారి ఆధ్వర్యంలో సత్యనారాయణ వ్రతాలు

పాపన్నపేట,నవంబర్23: మండల పరిధిలోని నాగసాన్ పల్లి గ్రామంలోని శ్రీ మురళీకృష్ణ దేవాలయం(Sri Muralikrishna Temple) వద్ద శ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని సూచించారు. భక్తిశ్రద్ధలతో ప్రతిరోజూ పరమేశ్వరుడిని పూజించాలని కోరారు. ఇంతటి ప్రశాంతమైన, ఆధ్యాత్మిక వాతావరణంలో కార్తీక మాస పూజలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్యాంసుందర్ శర్మ, రామ్ శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు