ఘనంగా ఆర్ఎస్పి జన్మదిన వేడుకలు

23-11-2026 | 10:11pm

చిన్నంబావి, నవంబర్ 23: మండల కేంద్రంలో స్వేరోస్, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(BRS Party State General Secretary) ఆర్ఎస్ ప్రవీణ్ 59 వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ, మాజీ జడ్పీటిసి వెంకట్రావమ్మ,స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్,చిన్నా రెడ్డి,ఈదన్న యాదవ్,రంజిత్ కుమార్,తగరం కురుమయ్య,నరసింహా, జీవికే నాయుడు,కానుగల రాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు