అటవీ శాఖ స్థలాన్ని పరిశీలించిన ఎఫ్డిఓ.

23-11-2026 | 10:11pm

నిజాంసాగర్ నవంబర్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని అటవీ శాఖకు చెందిన కార్యాలయాన్ని సోమవారం సాయంత్రం బాన్సువాడ ఎఫ్ డి ఓ సునీత(FDO Sunitha), ఎఫ్ ఆర్ ఓ హబీబ్ పరిశీలించారు నిజాంసాగర్ మండల కేంద్రంలో అటవీశాఖకు చెందిన భవనం చుట్టూ ఖాళీ స్థలం ఆక్రమణలకు గురి అవుతున్నట్లు సమాచారం అందరంతో పరిశీలించారు. సమీపంలోని కాలనీవాసులతో మాట్లాడుతూ తమ స్థలాన్ని కబ్జా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు భవనం తో పాటు ఖాళీ స్థలం చుట్టూ కొలతలు తీసి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు వారి వెంట అధికారులు శంకరప్ప బీట్ ఆఫీసర్ స్వరూప ఉన్నారు.

మరిన్ని వార్తలు