హామీలు నెరవేర్చడంలో ఎమ్మెల్యే విఫలం
రాజాపూర్ నవంబర్ 26: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(MLA Anirudh Reddy) విఫలమయ్యారని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీలు నెరవేర్చడం లేదని అన్నారు.భూ కబ్జాలు, కమిషన్లు మీద ఉన్న శ్రద్ద తప్ప అభివృద్ధి పై లేదని అన్నారు.స్థానిక పరిశ్రమల యజమానులతో కుమ్మక్కై స్థానిక యువకులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు.
నియోజకవర్గంలో ఏ గిరిజన తండా ఇప్పటివరకు రోడ్డు సౌకర్యం కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. బిజెపి పార్టీ ప్రజా సమస్యలపై పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి,శ్రీనివాస్ నాయక్,బిజెపి మండల అధ్యక్షుడు ఆనంద్,ప్రధాన కార్యదర్శి నర్సింహా, బీజేవైఎం మండల అధ్యక్షుడు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.