తాడూరులో ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరం ప్రారంభం
తంగళ్ళపల్లి, నవంబర్ 26 (విజయ క్రాంతి ): తంగళ్ళపల్లి మండలం తాడూరు గ్రామ విద్యార్థుల్లో సేవాభావం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందించడంలో జాతీయ సేవా పథకం(National Service Scheme) కీలక పాత్ర పోషిస్తుందని తాడూరు గ్రామ సర్పంచ్ సదానందం అన్నారు.
తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల సిరిసిల్ల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో తాడూరు గ్రామంలో వారం రోజుల పాటు నిర్వహించనున్న శీతాకాల ప్రత్యేక శిబిరం గురువారం ప్రారంభమైంది. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అధ్యాపకురాలు లావణ్య ఆధ్వర్యంలో జరిగే ఈ శిబిరంలో పచ్చదనం,
పరిశుభ్రత, ఆరోగ్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. జయ, గ్రామ కార్యదర్శి కవిత, ఉప సర్పంచ్ శ్రీధర్, మాజీ సర్పంచ్ నవీన్ రావు, ఉపాధ్యాయులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.