ఆరుతడి పంటలు సాగుచేయాలి

26-11-2026 | 11:14pm

వ్యవసాయ అధికారి మహేష్, మంగలితండ సర్పంచ్ ధారావత్ బాబ్జీ

కోదాడ నవంబర్ 26(విజయ క్రాంతి): వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో రైతులు ఆరుతడి పంటలు సాగుచేయాలని వ్యవసాయ అధికారి(Agricultural Officer) మహేష్, మంగలితండ సర్పంచ్ ధారావత్ బాబ్జీ అన్నారు. గురువారం మంగలితండ గ్రామ పంచాయతీ భవనం ఆవరణలో రైతులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వరిసాగు చేస్తే నీరు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. లాభసాటిగా ఉన్న ఆరుతడి పంటలు, కూరగాయల సాగుపై దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు