జర్నలిస్ట్ యాకూబ్ కుటుంబానికి రూ.30 వేల ఆర్ధికసహాయం
మహబూబాబాద్ టౌన్: మహబూబాబాద్ పట్టణంలో కొద్దిరోజుల క్రితం అకాల మృత్యువాత పడ్డ జర్నలిస్టు(Journalist) యాకూబ్ కుటుంబానికి గురువారం 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా టీయూ డబ్ల్యూజే(TUWJ) (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో ఏ..జర్నలిస్ట్ కు కష్టం వచ్చినా సాధ్యమైనంత మేర టియుడబ్ల్యూజే (ఐజేయు) అండగా నిలుస్తోందని చెప్పారు.
యాకూబ్ మరణించిన రోజు అతనికి నివాళులు అర్పించేందుకు వెళ్ళిన సమయంలో ఆ.. నిరుపేద కుటుంబం పరిస్థితిని చూసి మనసు చలించిందని., తక్షణ సహాయంగా రూ.5 వేలు ఆ..రోజు కార్యక్రమాల నిర్వహణ కోసం అందజేసామని, ఆ..కుటుంబానికి ఇంకా కొంత సహాయం చేయాలనే ఆలోచనతో వాట్సాప్ న్యూస్ గ్రూప్ లో మెసేజ్ పెట్టడం జరిగిందని తెలిపారు. శ్రీనివాస్ అడిగితే నిజమైన బాధితులకు.., ఖచ్చితంగా సహాయం అందుతుందని విశ్వసించే..,
మానవతా విలువలతో స్పందించిన దాతలు తమ వంతుగా విరాళాల రూపంలో రూ.30వేలు (అక్షరాల ముప్పై వేల రూపాయలు) పంపించారని శ్రీనివాస్ తెలిపారు.దాతల సహకారంతో సేకరించిన ఆ.. 30 వేల రూపాయలను యాకూబ్ సతీమణికి అందజేయడం జరిగిందని., తమ సహాయం చిన్నదే అయినా.., మా.. కుటుంబానికి జర్నలిస్ట్ యూనియన్ అండగా ఉంది అనే భరోసాను.., కొంత మానసిక ధైర్యాన్ని యాకూబ్ కుటుంబానికి..,
దాతల సహకారంతో అందజేయగలిగామని సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా ప్రధానకార్యదర్శి గాడిపల్లి శ్రీహరి, జిల్లాఉపాధ్యక్షుడు ఉమ్మగాని మధు, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లాప్రధానకార్యదర్శి రంగాచౌదరి, యూనియన్ నాయకులు బోనగిరి శ్రీనివాస్, రాహూల్ తదితరులు పాల్గొన్నారు.