సింగరేణిలో కార్మికులకు కౌన్సిలింగ్
కొత్తగూడెం నవంబర్ 26 విజయక్రాంతి: కొత్తగూడెం ఏరియాలోని(Kothagudem Area) రుద్రంపూర్ నందు గల ఆర్.సి.ఓ.ఎ క్లబ్ నందు గురువారం, ఉదయం 10.00 గంటల నుండి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సిహెచ్ వెంకటరమణ ఆదేశానుసారం 2026 సంవత్సరంలో ,జనవరి నుండి అక్టోబర్ వరకు 80 (అండర్ గ్రౌండ్)/120 (సర్ఫేస్) మాస్టర్లు, అంతకన్నా తక్కువ మాస్టర్లు చేసిన ఉద్యోగులకు ల కుటుంబ సభ్యులతో కార్మికులకు కౌన్సిలింగ్ ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిఎం సిహెచ్.వెంకటరమణ మాట్లాడుతూ , విధులకు గైర్హాజరు అవుతూ ఈ సంవత్సరం 2026లో తక్కువ మాస్టర్లు చేసిన ఉద్యోగులను వారి కుటుంబ సభ్యుల సమక్షంలో గైర్హాజరు కాకుండా, విధులకు హాజరయ్యేలా వారిని ప్రోత్సహించడానికి ఈ కౌన్సిలింగ్ కు పిలవడం జరిగిందని అన్నారు.
ఈ కౌన్సిలింగ్ కు 154 ఉద్యోగులను కౌన్సెలింగ్ కు పిలవడం జరిగిందని, వారిలో కౌన్సిలింగ్ కు 59 మంది ఉద్యోగులు హాజరైనారని, హాజరైన ప్రతి ఉద్యోగి గైర్హాజరు అవుటకు గల కారణాలను జిఎం , ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. మెడికల్ కారణంగా విధులకు హాజరుకాని ఉద్యోగులను సంబంధిత అధికారులతో, వారి ఆరోగ్య స్థితిగతులను మెడికల్ డిపార్ట్మెంట్ తో రివ్యూ చేయించాలని సూచించారు. ఈ కౌన్సిలింగ్ కు సంబంధిత అధికారులు, మెడికల్ సూపర్డెంట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిఎం తో పాటు కొత్తగూడెం ఏరియా ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ జె.గట్టయ్య, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్, ఎస్ ఓ టు జిఎం ఏం గోవిందరావు, పర్సనల్ మేనేజర్ ఎల్ తిరుపతి, మెయిన్ హాస్పిటల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ డి.
లలిత, డివైపిఎం జి. హరీష్, సీనియర్ పిఓలు మజ్జి.మురళి, ఎండి మతిన్ హుస్సేన్, బి. రాము, సంక్షేమ అధికారులు షేక్ షకీల్, విక్టర్ ఇతర విభాగాల సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.