ఆర్టీసీ నెలవారి సీజన్ టికెట్లపై ప్రత్యేక రాయితీల

18-11-2026 | 07:18pm

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్తగూడెం డిపో

నెలవారి సీజన్ టికెట్లపై (MST) పలు ప్రత్యేక రాయితీలు సదుపాయాలు

కొత్తగూడెం డిపో మేనేజర్ యు. రాజ్యలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు

కొత్తగూడెం: టౌన్ నవంబర్ 18 (విజయక్రాంతి) : నిత్యం ఆర్టిసి బస్సుల్లో(RTC bus) ప్రయాణించే ఉద్యోగులు విద్యార్థులు వ్యాపారులు(Employees, students, and businesspeople) ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోగలరు.  దూర పరిమితి లేకుండా( ఎంత దూరానికైనా) MST టికెట్స్ జారీ(Issuance of tickets) చేయనున్నట్లు ఆమె తెలియజేశారు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సులలో(Palle Velugu, Express, and Deluxe buses) ప్రయాణించే ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అని ఆమె అన్నారు. పల్లె వెలుగు, సీజన్ టికెట్ తీసుకున్న వారు  ఎక్స్ప్రెస్ లకు, ఎక్స్ప్రెస్ సీజన్ టిక్కెట్ తీసుకున్నవారు కాంబినేషన్ టికెట్(Combination Ticket) పై డీలక్స్ బస్సులలో ప్రయాణించవచ్చని ఆమె అన్నారు. 

ఏదైనా మంత్లీ సీజన్ టిక్కెటు ఉన్నవారు సూపర్ లగ్జరీ ఆపై బస్సులలో 10% రాయితీతోపాటు రెండు నెలల పాస్పై అదనంగా ఐదు రోజులు,  మూడు నెలల పాసుపై అదనంగా పది రోజులు,  వ్యాలిడిటీ కల్పిస్తున్నట్లు వారు వివరించారు.  మహిళా ప్రయాణికులు 15 రోజుల చార్జీతో  30 రోజులు ప్రయాణించే విధంగా MST టికెట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు.  ఏదైనా నెలవారి సీజన్ టికెట్లు కలిగివున్న ప్రయాణికులు సిటీలో ఆదివారం ఉచిత ప్రయాణం చేయవచ్చును అని అన్నారు. 

కావున ప్రయాణికులు ఆర్టీసీ సంస్థ ప్రవేశపెట్టిన ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని వారు ఈ సందర్భంగా ప్రయాణికులను కోరినారు.అదేవిధంగా కార్తీక మాసంలో ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు కొత్తగూడెం నుండి అన్నవరం, పంచారామాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి తెలియజేశారు.  ఈ సర్వీస్ లకు రిజర్వేషన్ సౌకర్యం ఏర్పాటు చేశామని,  ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలియజేశారు. 

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు :

1). 90103 74644

2). 9704816067

కొత్తగూడెం డిపో విలేజ్ బస్ ఆఫీసర్స్

మరిన్ని వార్తలు