22వ వార్డులో 13 మందికి చేయూత పెన్షన్లు
మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే కుంభం
పదేళ్ల నిరీక్షణకు తెర..
కాంగ్రెస్ ప్రభుత్వంలో పెన్షన్లు మంజూరు కావడంతో లబ్ధిదారుల్లో ఆనందం
ఆలేరు, నవంబర్ 18 (విజయక్రాంతి): భువనగిరి పట్టణంలోని(Bhongir town) 22వ వార్డుకు చెందిన 13 మంది లబ్ధిదారులకు(Beneficiaries) నూతన చేయూత పెన్షన్ల(Cheyutha pensions) మంజూరు పత్రాలను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbham Anil Kumar Reddy) అందజేశారు. పట్టణంలోని ఏకే ప్యాలెస్ ఫంక్షన్ హాలులో కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
గత పదేళ్లుగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెన్షన్లు మంజూరు కావడంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి, వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల, నాయకులు చల్ల కిషోర్, మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాష్ రెడ్డి, వార్డు ఆఫీసర్ ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.