నూతన పింఛన్ల పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం
గ్రామాలలో బెల్ట్ షాపులు ఎత్తివేయాలి
బెల్ట్ షాప్ ల వల్ల మద్యానికి బానిసవుతున్న యువత ప్రజలు
నసురుల్లాబాద్ నవంబర్ 18 ( విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా(Kamareddy District) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా, నూతన పింఛన్ల(New pensions), పత్రాలను పంపిణీ, చేసిన , ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(MLA Pocharam Srinivas Reddy), ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే అత్యధికంగా పింఛన్లు అందిస్తున్నామని, అన్నారు. ఈ సందర్భంగా గ్రామాలలో బెల్ట్ షాపుల వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం, ఎమ్మెల్యే పోచారం గ్రామ పెద్దలు గ్రామాలలో బెల్ట్ షాపులను ఎత్తివేయాలని ఆయన ఆదేశించారు.
బెల్ట్ షాప్ ల వల్ల మద్యానికి బానిసైన కుటుంబాలు రోడ్డున పడి అప్పుల పాలు అవుతున్నారని ఆయన విమర్శించారు,ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ మాజీ చైర్మన్ కాసుల బాలరాజు, ఎమ్మార్వో సువర్ణ, ఎంపీడీవో రవి ఈశ్వర్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెరిక శ్రీనివాస్, మాజీ ఎంపీపీ విట్టల్, వివిధ గ్రామాల సర్పంచులు లబ్ధిదారులు మండల నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.