అర్హులైన ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు

18-11-2026 | 07:13pm

గ్రామ సర్పంచ్ సుశీల

భూత్పూర్, నవంబర్ 18 : అర్హులైన ప్రతి పేదవారికి పార్టీలు, కుల మతాలకతీతంగా సంక్షేమ పథకాలు(Welfare Schemes) అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పెద్ద తాండ సర్పంచ్ సుశీల అన్నారు. ఈ సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గంలోని ఓ ఫంక్షన్ హాల్ లో పెద్ద తండా గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన నూతన పింఛన్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎంతోమంది లబ్ధిదారులను గుర్తించి నూతన పింఛన్లను మంజూరు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి  అనేది అన్నారు.

నూతన పింఛన్ల మంజూరు పత్రాలను అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు, గ్రామ సర్పంచ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు