సింగరేణి ఉద్యోగి మృతి.. కుటుంబానికి ఆర్థిక సాయం

18-11-2026 | 07:13pm

టేకులపల్లి, (విజయక్రాంతి): మండలంలోని కొత్త తండా గ్రామపంచాయతీకి(Kotha Thanda Gram Panchayat) చెందిన, కోయగూడెం ఓపెన్‌కాస్ట్‌లో(Koyagudem Opencast) విధులు నిర్వహిస్తున్న సింగరేణి ఉద్యోగి ఆంగోత్ కాశిరం(Singareni employee Angoth Kashiram) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు, ఉద్యోగులు ఆయన స్వగృహానికి చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం సింగరేణి తరఫున రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు.

నివాళులర్పించిన వారిలో అసిస్టెంట్ మేనేజర్ వాంగుడోత్ కిషన్, వెల్ఫేర్ ఆఫీసర్ అశోక్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అజ్మీర అశోక్, ఫోర్‌మెన్ భూక్య నాగేశ్వరరావు, కోయగూడెం ఓసీ ఓబీ  యూనియన్ అధ్యక్షుడు ముచ్చ సుధాకర్, అంతోటి రాకేష్, వెల్డర్ రాము, ఎలక్ట్రీషియన్లు బాసు, రమేష్, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు