సంక్షేమ పథకాలతో లబ్ధిదారులకు మేలు

18-11-2026 | 07:20pm
  1. ఎంపీడీవో బానోత్ పద్మావతితో కలిసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన సర్పంచ్ అజ్మీర ఉమా నరేష్
  2. సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చొరవ.. సంక్షేమ పథకాల అమలులో ముందువరుసలో మాదారం

సింగరేణి, నవంబర్ 18 (విజయక్రాంతి): సింగరేణి మండలం మాదారం గ్రామపంచాయతీలో(Madaram Gram Panchayat) సంక్షేమ పథకాలతో (welfare schemes) లబ్ధిదారులకు మేలు జరుగుతుందని లబ్ధిదారులకు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ అజ్మీర ఉమా నరేష్ ఆధ్వర్యంలో మండల ఎంపీడీవో బానోత్ పద్మావతి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు,

నూతన పెన్షన్లు, జాబ్ కార్డులు, రేషన్ స్మార్ట్ కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో బానోత్ పద్మావతి మాట్లాడుతూ గ్రామ ప్రజలకు, లబ్ధిదారులకు సంక్షేమ పథకాల అమలు, వాటి వినియోగంపై పలు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డులు, పెన్షన్లు, రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పావలా వడ్డీ రుణాలు వంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు నాయకులు పేర్కొన్నారు.

మాదారం గ్రామ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.. గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని సర్పంచ్ అజ్మీర ఉమా నరేష్ తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో మాదారం గ్రామపంచాయతీని ముందువరుసలో నిలిపేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో తమ కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రాందాస్ నాయక్, సర్పంచ్ అజ్మీర ఉమా నరేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వాసం విజయ్ కుమార్, వార్డు సభ్యులు, ఇందిరమ్మ డైరెక్టర్, డ్వాక్రా గ్రూప్ వీవోలు, అఖిలపక్ష నాయకులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు