చెరుకు టన్నుకు రూ.5 వేల ధర ప్రకటించాలి
బోనస్‌తో రైతులకు గిట్టుబాటు కల్పించాలి..
రామారెడ్డి, నవంబర్ 18 (విజయక్రాంతి): పెరుగుతున్న సాగు ఖర్చులను(cultivation costs) దృష్టిలో ఉంచుకొని చెరుకు రైతులకు(Farmers') టన్నుకు బోనస్‌తో కలిపి రూ.5 వేల ధర ప్రకటించాలని కామారెడ్డి కేన్ డెవలప్మెంట్ కౌన్సిల్(Kamareddy Cane Development Council) (CDC) చైర్మన్ మహమ్మద్ ఇర్షదుద్దీన్(Mohammed Irshaduddin) ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఆధ్వర్యంలో చెరుకు రైతుల ప్రతినిధి బృందం తెలంగాణ రాష్ట్ర షుగర్ అండ్ కేన్ కమిషనర్ నర్సిరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసింది.
ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎరువులు, కూలీల ఖర్చులు, రవాణా వ్యయం రోజురోజుకూ పెరుగుతున్నాయని, దీంతో చెరుకు సాగు భారంగా మారుతోందని వివరించారు. పెరిగిన పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా ప్రస్తుత ధరకు అదనంగా బోనస్ ప్రకటించి, టన్నుకు మొత్తం రూ.5 వేల ధర కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
చెరుకు సాగు కొనసాగాలంటే రైతులకు గిట్టుబాటు ధర తప్పనిసరిగా ఉండాలని ప్రతినిధి బృందం పేర్కొంది. సరైన ధర లభిస్తేనే రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు చెరుకు సాగుపై ఆసక్తి కొనసాగుతుందని తెలిపింది. రైతుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కమిషనర్‌ను కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సింలు, సదాశివరెడ్డి, సీనియర్ నాయకులు పైడి జనార్దన్, ఆకుల సిద్ధి రాములు, ఆకుల విఠల్, బొలిపెల్లి మహేందర్ రెడ్డి, శెకెల్లి బాల్‌రాజు, సంకరి రాజలింగం, ఆకుల గంగరాజం, బక్కన్నగారి భాస్కర్, రాంశెట్టి నర్సింలు, కాలమల్ల అశోక్‌తో పాటు చెరుకు రైతులు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.