సింగరేణి పాఠశాలను సందర్శించిన సొసైటీ కార్యదర్శి
మందమర్రి, (విజయక్రాంతి): సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ(Singareni Educational Society) కార్యదర్శి రాజేంద్రప్రసాద్ బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని సింగరేణి హైస్కూల్‌ను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి, క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థుల్లో భాషా, గణిత నైపుణ్యాలను పెంపొందించాలని కోరారు. పాఠశాలకు త్వరలో డిజిటల్ బోర్డులు, ఆధునిక కంప్యూటర్లు, బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ, అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జె. పురుషోత్తం, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.