చేయూత పథకం పేదలకు ఆర్థిక భరోసా
మంత్రి సీతక్క
మహబూబాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం(Congress People's Government) పేదలకు ఆర్థికంగా భరోసా కల్పించడానికి చేయూత పథకం ద్వారా కొత్త పింఛన్లను మంజూరు చేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో నూతన చేయూత పెన్షన్ల ప్రొసీడ్ పత్రాలను మంత్రి ధనసరి అనసూయ సీతక్క అందజేశారు.
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం చేయూత పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణం లో నిర్వహించారు. గార్ల మండలంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పింఛన్ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్, హౌసింగ్ పిడి పురుషోత్తం, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, కొత్తగూడ, గార్ల, ఎంపీడీవోలు, తహసీల్దారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.