ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఆటల పోటీలు
నేరేడుచర్ల, నవంబర్ 18(విజయ క్రాంతి: నేరేడుచర్ల మండల పరిధిలోని ప్రత్యేక అవసరాలు గల (సీడబ్ల్యూఎస్ఎన్) పిల్లలకు ఎంపీపీఎస్ చింతబండ పాఠశాల(MPPS Chintabanda School) పరిధిలోని భవిత సెంటర్లో ఆటల పోటీలు(Sports competitions) నిర్వహించారు. మండల విద్యాధికారి ఎం.బాలు(Mandal Educational Officer M. Balu) పోటీలను ప్రారంభించారు.
మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన పిల్లలు రన్నింగ్, కబడ్డీ, కోకో, క్యారమ్స్, చెస్, స్పూన్ రేస్ తదితర ఆటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం విజేతలకు ఎంఈఓ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి.అక్కయ్యబాబు, ఉపాధ్యాయులు కె.ప్రసాద్, స్పెషల్ ఎడ్యుకేటర్ టి.చంద్రశేఖర్రెడ్డి, ఐఈఆర్పీ వెంకటరమణ, ఆయాలు జానకమ్మ, చుక్కమ్మ, సరిత, రేణుక, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.