మేకల మార్కెట్.. పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
21-11-2026 | 01:43pm
రాజంపేట (విజయక్రాంతి): రాజంపేట గ్రామపంచాయతీ పరిధిలోని జూబ్లీ మార్కెట్ ఎదుట మేకల మార్కెట్ (Goat Market) నిర్వహించారు. వ్యాపారులు, కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అవసరమైన వసతులు (Basic Facilities) కల్పించారు.
మార్కెట్లో చేపట్టిన ఏర్పాట్లను సర్పంచ్ బుర్సా పోచయ్య, వార్డు సభ్యుడు గులాం జవీద్, పంచాయతీ కార్యదర్శి జె. సాయికృష్ణ, జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్, బిల్ కలెక్టర్ నాగేంద్ర పర్యవేక్షించారు. మార్కెట్ నిర్వహణను క్రమబద్ధీకరించి (Market Management) ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని వారు తెలిపారు.