ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి నేతల స్వాగతం
21-11-2026 | 01:45pm
బోథ్, నవంబర్ 21 (విజయక్రాంతి): బజార్హత్నూర్ మండల కేంద్రంలో ఆసరా చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం (Welcome) పలికారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ ఆధ్వర్యంలో నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ జి. రాజు యాదవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మెరుగు భోజన్న, సహకార సంఘం డైరెక్టర్ లోలపు పోశెట్టి, బుజ్జ సాయన్నతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.