రేపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించండి
నాగల్గిద్ద, నవంబర్ 21 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 22న ఆదివారం పల్స్ పోలియో (Pulse Polio) కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల ప్రాథమిక ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ జువేరియా బేగం తెలిపారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు (Polio Drops) వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.
నవంబర్ 23, 24 తేదీల్లో పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారుల కోసం వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి టీకాలు (Vaccination) వేస్తారని వెల్లడించారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి (Polio-Free Society) ప్రతి ఒక్కరూ సహకరించాలని డాక్టర్ జువేరియా బేగం విజ్ఞప్తి చేశారు.