పేరంటాళ్ళ చెరువు, దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి

05-11-2026 | 04:22pm

అలుగు కాలువపై కల్వర్టుకు నిధులు మంజూరు చేయిస్తా

దమ్మపేట, నవంబర్ 05 (విజయక్రాంతి): దమ్మపేట మండలంలో మురసు తుఫాను(Murasu cyclone) ప్రభావంతో దెబ్బతిన్న పంటలను, మండల పరిధిలోని నాగుపల్లి సమీపంలోగల ముసలిబంధం చెరువు కట్ట తెగిపోయిన ప్రాంతాన్ని, మల్లెపూల వాగు, మండల కేంద్రంలోని తెగిపోయిన పేరంటాళ్ళ చెరువు అలుగు కాలువను రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహనిర్మాణ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy).

అశ్వారావుపేట నియోజకవర్గ యం.ఎల్.ఎ. జారె ఆదినారాయణ, సత్తుపల్లి యం.ఎల్.ఎ. మట్టా రాగమయి, భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ లతో కలిసి పరిశీలించారు. చెరువుకు గండి పడటానికి గల కారణాన్ని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ ఎస్. శ్రీనివాసరెడ్డిని అడిగి తెలుసుకున్నారు.

పెరాంటాళ్ళ చెరువు అలుగు కాలువ ఇరుకుగా వుండండంతో వరద ఉధృతిని తట్టుకోలేక తెగిపోతున్నదని, అలుగు కాలువ వెళ్ళే క్రమంలో కల్వర్టు కూడా ఇరుకుగా వుండడంతో గత రెండు సంవత్సరాల నుండి తెగిపోతున్నదని మంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి విలేఖరులతో మాట్లాడుతూ గడచిన 36 గంటలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాల కలెక్టర్లు, ఎస్.పి.లు, పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగంతో పాటు అన్ని డిపార్టుమెంట్లు, ఎస్.డి.ఆర్.ఎఫ్., ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందాలు చాలా సమయస్ఫూర్తితో వ్యహరించి ఎటువంటి ప్రాణహాని కలగకుండా వ్యవహరించారని తెలిపారు.

ఒకప్రక్క ఎలినినో ప్రభావంతో, ఎండలతో అల్లాడుతూ వర్షాలు లేక నష్టపోతూవుంటే, అరకొర పంటలు వేసిన రైతులకు మురసు తుఫాన్ రూపంలో నష్టం చేకూర్చిందని అన్నారు. ముఖ్యమంతి రేవంత్ రెడ్డి సూచనల ప్రకారం అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల యం.ఎల్.ఎలతో కలిసి జరిగిన నష్టాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.

సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో సుమారు 5 మైనర్ ఇరిగేషన్ చెరువులు తెగిపోయాయని తెలిపారు. దమ్మపేట మండల పరిధిలోని మల్లెపూల వాగు ఉప్పొంగి వాగుకు ఇరుప్రక్కన గల పంటలకు నష్టం వాటిల్లిందని, అదేవిధంగా దమ్మపేటకు ఆనుకుని వున్న పేరంటాళ్ళ చెరువు అలుగు కాలువ తెగిపోవడంతో పంట నష్టం జరిగిందని తెలిపారు.

పేరంటాళ్ళ చెరువు అలుగు కాలువ వెడల్పు చేయుటకు యం.ఎల్.ఎ. జారె ఆదినారాయణ, స్థానిక నాయకులతో చర్చించి అలుగు కాలువకు ఆనుకుని వున్న నివాసితులకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయించి, అలుగు కాలువపై కల్వర్టు ఏర్పాటు కు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు భవిష్యత్తులో ఇది రిపీట్ కాకుండా చర్యలు చేపడతామని తెలిపారు.

ఎటువంటి ప్రాణహాని జరుగకుండా కాపాడిన రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, విద్యుత్ శాఖా జిల్లా యంత్రాంగాలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి, వైస్ సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు పగడాల రాంబాబు,

చిన్నశెట్టి యుగంధర్, చిన్నశెట్టి చిట్టిబాబు, చిన్నశెట్టి గోపి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కక్కిరాల రమేష్, పర్వతనేని ప్రసాద్, సి.ఐ. నాగరాజు, ఎస్.ఐ.బి. రాజేష్ కుమార్, మండల వ్యవసాయ అధికారి చంద్రశేఖర్రెడ్డి, ఎంపీడీఓ బి రవీంద్ర రెడ్డి, తహసీల్దార్ మద్దినేని మురళి, మండలంలోని కాంగ్రెస్ నాయకులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు