వాగుల చుట్టూ విద్యుత్ మోటారు బిగించి నీటి విక్రయాలు

05-11-2026 | 04:01pm

బోథ్. నవంబర్ 5 (విజయక్రాంతి) రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో నీటి ఎద్దడి రాకుండా ముందస్తుగా వాగుల చుట్టూ ఉన్న విద్యుత్ మోటార్లను తొలగించాలని ఈ విషయంలో సంబంధిత మండలాల తహసీల్దారులు చేపట్టాలని ఆదేశించింది.

అయితే కొంతమంది పాగుల చుట్టూ మోటార్లను తొలగించకుండానే నీటిని ఇతర రైతులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. మండలంలోని పో చ్చేర జలపాతం దిగువ బాగాన ఉన్న కొంతమంది రైతులు విద్యుత్ మోటార్లను తొలగించకుండా నీటిని తోడుకుంటూ నీటి వసతి లేని రైతులకు నీటి తడులను ఇచ్చి డబ్బులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

అయితే రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని ఈ కొత్త విధానానికి తెర లేపారు. దీంతో భవిష్యత్తులో వాగులు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటి పోయే ఆస్కారం ఉంది. 

ఎన్నిసార్లు చెప్పినా తొలగించడం లేదు

వాగు చుట్టూ ఉన్న మోటార్లను తొలగించాలని ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది రైతులు మొండిగా వ్యవహరిస్తూ మోటార్లను తొలగించడం లేదని కుమారి గ్రామ సర్పంచ్ అగ్గిమల్ల గోదావరి లక్ష్మన్న పేర్కొన్నారు. తమతోపాటు వార్డు సభ్యులు సంతోష్ సైతం ఢిల్లీ మోటార్లు తొలగించాలని తెలిపిన పట్టించుకోవడంలేదని వాపోయారు.

రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలి

వాగు చుట్టూ ఉన్న విద్యుత్ మోటార్లను తొలగించేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నీటిని వినియోగించుకోవడమే కాకుండా విక్రయించుకుని సొమ్ము చేసుకోవడం నేరం అనే విషయాన్ని రైతులకు వివరించి చర్యలు చేపట్టాలని వారు కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భూగర్భ జలాలు అడుగంటి పోయే ఆస్కారం ఉందని వాపోయారు.

మరిన్ని వార్తలు