మెడిసిటీ రిటైర్డ్ ఉద్యోగి ఎల్లాప్రగడ దత్తాత్రేయ శర్మ మృతి

05-11-2026 | 04:06pm

మేడ్చల్ అర్బన్ నవంబర్ 5(విజయక్రాంతి):ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణ పరిధిలోని ఘనపూర్ మెడిసిటీ ఆసుపత్రిలో(Medicity Hospital) మార్కెటింగ్ సూపర్వైజర్ గా విధులు నిర్వహించిన రిటైర్డ్ ఉద్యోగి ఎల్లాప్రగడ దత్తాత్రేయ శర్మ(Ellapragada Dattatreya Sarma) అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మేడ్చల్ మున్సిపల్ పట్టణానికి చెందిన బిజేపి యువ నాయకులు(BJP youth leaders) ఎల్లాప్రగడ పవన్ తండ్రి శర్మ మృతి చెందటంతో బిజేపి నేతలు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

మెడిసిటీ ఆసుపత్రిలో ఉద్యోగం చేసిన శర్మ అంత్య క్రియల్లో బిజెపి నాయకులు పట్లోల్ల విక్రమ్ రెడ్డి.అమరం మోహన్ రెడ్డి.పాతూరి ప్రభాకర్ రెడ్డి.మేడ్చల్ మున్సిపల్ పట్టణ బిజెపి అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్.సర్వేశ్వర్ రెడ్డి.సిఎం రాజు.రామన్నగారి శ్రీనివాస్ గౌడ్.జి శ్రీనాథ్ రెడ్డి.వేణుగోపాల్ రెడ్డి.కొండం ఆంజనేయులు ముదిరాజ్.చెరువుకొమ్ము శ్రీనివాస్ గౌడ్.రాఘవ రెడ్డి.ప్రేమ్ దాస్.తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు