బోధన్ పట్టణంలో ఐఎంఏ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు
ఆర్ఎంపీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లలో పరిశీలన..
బోధన్, నవంబర్ 05 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలో గురువారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)(Indian Medical Association) ఆధ్వర్యంలో పలు ఆర్ఎంపీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను ఐఎంఏ ప్రతినిధులు పరిశీలించారు.
ఈ సందర్భంగా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న మందులు, వైద్య పరికరాలు, మందుల నిల్వలు, వాటి వినియోగానికి సంబంధించిన వివరాలను పరిశీలించినట్లు సమాచారం. ఫస్ట్ ఎయిడ్ సెంటర్లలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, మందుల పరిస్థితిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.
తనిఖీల సమయంలో కొన్ని కేంద్రాల్లో గుర్తించిన అంశాలను అధికారులు వీడియో రూపంలో చిత్రీకరించినట్లు సమాచారం. ఈ ఆకస్మిక తనిఖీలతో బోధన్ పట్టణంలోని ఆర్ఎంపీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల నిర్వాహకుల్లో చర్చ మొదలైంది. ఈ తనిఖీల వివరాలు, తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది.