రేపు మిడ్జిల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
05-11-2026 | 04:09pm
మిడ్జిల్, నవంబర్ 6: మండలంలోని 33/11 కేవీ మిడ్జిల్ సబ్స్టేషన్లో(33/11 kV Midjil Substation) సోలార్ లైన్ మరమ్మతుల(Solar line repairs) కారణంగా శుక్రవారం (నవంబర్ 6) విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 11 కేవీ కొత్తూరు ఫీడర్ పరిధిలో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు 11 కేవీ మిడ్జిల్ గ్రామ ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ నరేందర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత ఫీడర్ల పరిధిలోని గ్రామాల ప్రజలు, రైతులు, విద్యుత్ వినియోగదారులు ఈ అంతరాయాన్ని గమనించి విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.