పేద విద్యార్థులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం!
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): పేదరికం కారణంగా ఏ విద్యార్థి ఉన్నత విద్యకు దూరం కాకూడదని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు బ్యాగులు, యూనిఫామ్స్ (Bags and Uniforms) పంపిణీ చేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకు (Student Future) కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విద్య ద్వారానే (Quality Education) జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని, ప్రతి ఒక్కరూ చదువుపై (Educational Support) ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సునేంద్ర, వైస్ చైర్మన్ రమేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, వార్డు కౌన్సిలర్ చంద్రకళ, నిజాం, పడిగే శంకర్, అవంచ మాధవి, రాజేశ్వరి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జక్కా రాజు, నాయకులు హాసన్, ఇసాక్, ఖాదర్, హమీద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.