నాగిరెడ్డిపేట్లో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

05-11-2026 | 04:03pm

నాగిరెడ్డిపేట్,నవంబర్ ఐదు (విజయ క్రాంతి):మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో(Bharatiya Janata Party Office) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)  చిత్రపటానికి మండల బిజెపి పార్టీ నాయకులు,కార్యకర్తల సమక్షంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది.

తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన రూ.873 కోట్ల నిధుల్లో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన 33 గ్రామ పంచాయతీల నూతన భవనాల నిర్మాణానికి విబిజి ఆర్ఏఎంజి పథకం ద్వారా రూ.6.60 కోట్లు,అలాగే  ఎన్ఎబిఎఆర్ డి నిధుల ద్వారా 73 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.22.33 కోట్లు కేటాయించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేస్తూ.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట మండల బీజేపీ అధ్యక్షుడు  మడుపు శ్రీనివాస్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధితో పాటు ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన,ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం అభినందనీయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో  బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు హనుమాన్లు , ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి బోయిని బాలయ్య,మండల ప్రధాన కార్యదర్శి కిషన్, ఈశ్వర్ గౌడ్,మండల ఉపాధ్యక్షులు రాజు,బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ,మేకల రాజు,గోపాల్,బూత్ అధ్యక్షులు నాగరాజ్ గౌడ్, సిద్ధిరాములు,రాజు, ప్రశాంత్, ప్రవీణ్ మల్లేష్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు