బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ జేఏసీ సమావేశం
చుంచుపల్లి, నవంబర్ 11 (విజయక్రాంతి): అణగారిన కులాల హక్కుల సాధనే లక్ష్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంఘాల ఐక్య సమావేశం కొత్తగూడెం బీసీ సంఘం(Kothagudem BC Association) కార్యాలయంలో నిర్వహించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను పేద ప్రజలకు అమలు చేయడంలో విఫలం చెందారని విమర్శించారు. భారత రాజ్యాంగంపై శబ్దం చేసిన పాలకులు వ్యక్తిగత దూషణలతో కాలం గడుపుతూ.. ప్రజల నమ్మకాలని వమ్ము చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీల రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని అన్నారు.
పాలన సౌలభ్యం కోసం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతం పేరుతో ఎస్సీ కులాల స్థానిక జడ్పిటిసి,ఎంపిటిసి ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలని,బీసీ కులాల జనాభా దామాషా ఆధారంగా బీసీ రిజర్వేషన్ 56% అమలు చేయాలని,ఏజెన్సీ ప్రాంత గిరిజన చట్టాలను ప్రతిష్టంగా అమలు చేయాలని,1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దుపరిచి దళిత క్రైస్తవులకు ఎస్పీ హోదా కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఐక్య ఉద్యమాలు చేపడతామని సమావేశంలో తీర్మానించారు. ఈ సందర్భంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ జేఏసీ కమిటీ ఎన్నుకున్నారు.