టిఎస్ యూటిఎఫ్ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

11-11-2026 | 07:04pm

నేరేడుచర్లలో టీఎస్‌యూటీఎఫ్ కరపత్రాలు ఆవిష్కరణ.

నేరేడుచర్ల, నవంబర్ 11(విజయ క్రాంతి): టీఎస్‌యూటీఎఫ్ సూర్యాపేట జిల్లా(TSUTF Suryapet District) 6వ మహాసభలను జయప్రదం చేయాలని నేరేడుచర్ల మండల శాఖ నాయకులు(Nereducherla Mandal Leaders) ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.2026 నవంబర్ 14, 15 తేదీలలో హుజూర్‌నగర్ టౌన్ హాల్‌లో జరగనున్న సూర్యాపేట జిల్లా 6వ మహాసభల కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం.

మంగళవారం జెడ్పీహెచ్ఎస్ నేరేడుచర్ల పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ నేరేడుచర్ల మండల శాఖ అధ్యక్షులు ఆర్. శ్రీనయ్య, ప్రధాన కార్యదర్శి బి. అక్కయ్య బాబు కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, విద్యారంగం బలోపేతం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై జిల్లా మహాసభలలో విస్తృతంగా చర్చ జరుగుతుందని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అత్యధిక సంఖ్యలో హాజరై మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు ఎండీ రషీద్ ఖాన్ తో పాటు ఎన్. నరసింహారావు, కె. వెంకటేశ్వరరావు, వై. జానయ్య, ఎ. అన్నపూర్ణ, ఎస్డీ హశ్రున్, ఎం. యాదగిరి, ఆర్. శౌరి, కె. శ్రీనివాస్, బి. భీకోజి, వి. రవీందర్ రెడ్డి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు