50 ఏళ్ళు దాటినా వీడని స్నేహితులు!
- తోటి మిత్రునికి వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం
- అభినందించిన సర్పంచ్ రవీందర్
- దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి
ముస్తాబాద్,నవంబర్ 11( విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామానికి(Avunur Village) చెందిన గీత కార్మికుడు(Toddy Tapper) వేముల నారాయణ గౌడ్ ఇటీవల ప్రమాదవశాత్తు తాటిచెట్టు పై నుండి పడి కరీంనగర్ ఆసుపత్రి(Karimnagar Hospital) చికిత్స పొందుతున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న నారాయణ చిన్ననాటి మిత్రులు వైద్య ఖర్చుల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లితమ వంతుగా 32 వేల 5 వందల రూపాయలు అతని కుటుంబ సభ్యులకు అందించారు.1975 సంవత్సరంలో గూడెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నారాయణతో పాటు చదివిన అతని స్నేహితులు 50 ఏళ్ళు దాటిన ఇప్పటికి మంచి స్నేహితులుగా ముద్ర వేసుకున్నారు.
వారిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా "బాల్య మిత్రునికి భరోసా"అనే మంచి ఆలోచనతో ఆర్థికంగా అండగా నిలుస్తూ వారి మానవత్వం నిరూపించుకుంటున్నారు.ఆ విదంగానే తమ స్నేహితుడు నారాయణకు వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం అందించి ఇప్పటి తరానికి ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ నక్కదాసరి రవీందర్ వారిని అభినందిస్తూ ప్రతి ఒక్కరు మానవత్వం తో ఆలోచించి ఇలాంటి ఆపద సమయంలో పేద వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.అలాగే గ్రామానికి చెందిన మరి కొంత మంది దాతల సహాయంతో మరో 50 వేలు జమ చేసి ఈరోజు వరకు మొత్తం 82 వేల ఐదు వందల రూపాయలు అందించినట్లు తెలిపారు. ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ నక్కల రాజు పేర్కొన్నారు.