నవోదయ మోడల్ పరీక్షకు స్పందన
బూర్గంపాడు,(విజయక్రాంతి): సారపాక బ్రిలియంట్ హైస్కూల్‌లో గురువారం నిర్వహించిన నవోదయ మోడల్ పరీక్షకు(Navodaya Model Test) మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలపై భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు మోడల్ పరీక్షలు దోహదపడతాయని బ్రిలియంట్ విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ బి.ఎన్.ఆర్ తెలిపారు. గ్రామీణ విద్యార్థులను జాతీయస్థాయి పోటీలకు సిద్ధం చేయడమే తమ లక్ష్యమన్నారు.
పరీక్షలో సుశాంత్ తేజ మొదటి, కీర్తిశ్రీ రెండో, ఈశ్వర్ హేమచంద్ర, అజంతా సంయుక్తంగా మూడో ర్యాంకు సాధించినట్లు వెల్లడించారు. గత 15 ఏళ్లలో తమ సంస్థ నుంచి వందలాది మంది నవోదయ, సైనిక్ స్కూల్, గురుకులాల్లో ప్రవేశాలు పొందారని తెలిపారు.