గిరిజన దర్బార్, ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు సకాలంలో హాజరు కావాలి
20-09-2026 | 07:23pm
ఐటిడిఏ పిఓ బి.రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట
భద్రాచలం (విజయక్రాంతి): సెప్టెంబర్ 21 సోమవారం నాడు భద్రాచలం ఐ టి డి ఏ, సబ్ కలెక్టర్ కార్యాలయంలో (ITDA, Sub Collector's Office)నిర్వహించనున్న గిరిజన దర్బార్, ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు, డివిజన్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట ఆదివారం నాడు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు మరియు ప్రజలు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని వారు తెలుపుతూ సంబంధిత యూనిట్ అధికారులు, డివిజన్ అధికారులు ఉదయం 10.30 గంటలకు భద్రాచలం ఐటీడీఏ మరియు సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరాలలో తప్పకుండా హాజరుకావాలని వారు పేర్కొన్నారు.