విజయవంతమైన విద్యాసంస్థల బంద్

18-11-2026 | 05:26pm

బంద్‌ను అడ్డుకునేందుకు అధికారుల ప్రయత్నాలు.. విద్యార్థి సంఘాల ఆగ్రహం

ఇల్లెందు, (విజయక్రాంతి): కీచక ఉపాధ్యాయుడిని విధుల(Teacher duties) నుంచి తొలగించాలని, మర్రిగూడెం పాఠశాల (Marrigudem School) ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన్‌ను ఐదు రోజులకే ఎత్తివేయడంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ PDSU (ప్రజాపంథా), PDSU ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు బంద్‌కు సహకరించాయని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా PDSU జిల్లా కార్యదర్శి జె.గణేష్, డివిజన్ నాయకుడు గంగాధర గణేష్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆందోళనలు, మీడియా కథనాలు వెలువడుతున్నా విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం విచారకరమన్నారు. పాఠశాలల నుంచి విచారణ నివేదికలు పంపామని చెబుతుండగా, డీఈవోకు నివేదిక అందలేదని చెప్పడం అధికారుల మధ్య సమన్వయ లోపానికి నిదర్శనమన్నారు.

మర్రిగూడెం ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన్‌ను ఐదు రోజులకే ఎత్తివేసి తిరిగి పోస్టింగ్ ఇవ్వడంపై అధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బంద్‌ను విఫలం చేసేందుకు ఇల్లందు ఎంఈవో ప్రధానోపాధ్యాయులకు విద్యార్థి సంఘాల నాయకులు వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సందేశాలు పంపడం సమంజసం కాదన్నారు.

మరోవైపు బంద్‌ను పర్యవేక్షిస్తున్న PDSU నాయకులు గంగాధర గణేష్, పార్థసారథిలను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నాయకులు శ్రావణి, హేమచంద్ర ఖండించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రోహిత్, శ్రావణి, జెశ్వంత్, నాగ చైతన్య, పాండు, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు