రీ సర్వే పనులను పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ప్రసూనాంబ
జగిత్యాల, నవంబర్ 18 ( విజయక్రాంతి ) : జగిత్యాల జిల్లా(Jagtial District) సారంగాపూర్ మండలంలోని పోతారం, బీర్పూర్ మండలం(Potaram, Beerpur Mandal) లోని సిరిపురం, రాయికల్ మండలం ఆలూర్, వీరాపూర్ గ్రామాల్లో జరుగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను(Land Re-survey Process) జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ప్రసూనాంబ(N. Prasunamba) బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో కొనసాగుతున్న రీ సర్వే పనుల పురోగతిని, సర్వే నిర్వహిస్తున్న విధానాన్ని, భూ రికార్డుల వివరాలను(Land records details) సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రీ సర్వే ప్రక్రియలో ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. రైతులు(Farmers), భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వే ప్రక్రియను చేపట్టాలని, భూముల హద్దులు, విస్తీర్ణం తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని సూచించారు. సర్వే సమయంలో ఎదురయ్యే సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
రీ సర్వే ద్వారా భూ రికార్డుల్లో ఖచ్చితత్వం ఉండేలా చూడాలని, నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు జ సూచించారు. ఈ కార్యక్రమంలో సారంగాపూర్, బీర్ పూర్, రాయికల్ మండల తహసీల్దార్ లు, సంబంధిత అధికారులు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.