పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

18-11-2026 | 05:11pm

ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో

గోవిందరావుపేట, నవంబర్ 18 (విజయక్రాంతి) : గిరిజన ప్రాంతాల్లో(Tribal area) మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యార్థులకు(Students') మెరుగైన వసతి సౌకర్యాల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం(Central Government) అమలు చేస్తున్న ధర్తి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకం(Dharti Aaba Janjatiya Gram Utkarsh Abhiyan Scheme) కింద చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో అధికారులను ఆదేశించారు. పథకం అమలు పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు బుధవారం గోవిందరావుపేట మండల(Govindaraopet Mandal) పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి నిర్మాణ పనులు, విద్యాసంస్థల(Educational institutions) నిర్వహణను క్షేత్రస్థాయిలో సమీక్షించారు.

మండలంలోని కర్లపల్లి గ్రామంలో  డిఎ జేయుజిఎ  పథకం కింద చేపడుతున్న సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణ పనులను పీఓ పరిశీలించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్లాస్టరింగ్ పనుల పురోగతిని సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, పనుల్లో ఎలాంటి నాణ్యతా లోపాలు లేకుండా నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఏ హెచ్ ఎస్ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించిన పీఓ వంటగది, స్టోర్ గదులను పరిశీలించారు.

పాఠశాలలో అందుబాటులో ఉన్న గ్యాస్ సిలిండర్లు, వంట సామగ్రి నిల్వలు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన  వివరాలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన పరిమాణాల్లో పెద్ద, చిన్న వంట పాత్రలు అందుబాటులో ఉండేలా చూడాలని, విద్యార్థులకు నిర్ణీత మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి చదువు, పరీక్షల సన్నద్ధత, అభ్యసన స్థాయిని తెలుసుకున్నారు. అధికారులు బాధ్యతలు పూర్తి చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు