హెచ్ ఆర్సీని ఆశ్రయించిన న్యాయవాది

18-11-2026 | 08:49am

తనపై రౌడీ షీట్ తెరిచారని ఎం శ్రీనివాస్ ఆరోపణ

హైదరాబాద్,(విజయక్రాంతి): తనపై మల్కాజిగిరి పోలీసులు(Malkajgiri Police) రహస్యంగా రౌడీ షీట్ తెరిచారని ఆరోపిస్తూ ప్రముఖ న్యాయవాది మేకల శ్రీనివాస్ యాదవ్(Prominent lawyer Mekala Srinivas Yadav) అలియాస్ ఎం.శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను, ఉన్నత పోలీసు, ప్రభుత్వ అధికారులను ఆశ్రయించారు. మలాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో తనకు ఎలాంటి నోటీసు, ఉత్తర్వు లేదా  తెలియజేయకుండానే తనపై రౌడీ/సస్పెక్ట్ షీట్ తెరిచారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా శ్రీనివాస్ యాదవ్ అనేక సంవత్సరాలుగా ప్రజా సమసలపై పోరాడుతున్నారు. ఆయన పోలీసు అకృత్యాలకు వతిరేకంగా పోరాడారు. ప్రభుత్వ భూములను ఆకమణల నుంచి కాపాందుకు కృషి చేశారు. అటవీ, పరావరణ అంశాలపై ప్రజాహిత వ్యాజ్యాలు నడిపారు.

పోలీసు అతిక్రమణలకు వ్యతిరేకంగా నిలబడిన నాయవాదినే, కారణం చెప్పకుండా పోలీసు నిఘాలో ఉంచడం తీవ ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 12న రాష్ట్ర హైకోర్టు(State High Court) 2026లో రౌడీ షీట్‌ను తెరవడం, సమీక్షించడం, మూసివేయడంపై రాష్ట్రవ్యాప్త మార్గదర్శకాలు జారీ చేసింది. దాని ప్రకారం ఎం.శ్రీనివాస్ యాదవ్ మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రిన్సిపల్ సెక్రటరీ(హోం), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్, సంబంధిత డిప్యూటీ కమిషనర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు వినతిపత్రం పంపారు. తన సమాచార హక్కు దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని, రికార్డు అందిన తర్వాత స్పందించేందుకు న్యాయమైన అవకాశం కల్పించాలని ఆయన కోరారు. అలాగే ఆయన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. 

మరిన్ని వార్తలు