ఘనంగా చేయూత ఆసరా పింఛన్ల పంపిణీ
భిక్కనూర్, నవంబర్ 18 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం రామేశ్వర్పల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం(Government of Telangana) అమలు చేస్తున్న చేయూత ఆసరా పింఛన్ల('Cheyutha' and 'Asara' pensions) మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అర్హులైన వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులకు మంజూరైన పింఛన్ల పత్రాలను ముఖ్య అతిథులు అందజేశారు.
ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, పీఏసీఎస్ చైర్మన్ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీడీవో సవితా రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ ఎడ్ల రాజారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద, బలహీన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో చేయూత ఆసరా పింఛన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉపసర్పంచ్ గొల్లపల్లి వినోద్ కుమార్ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ నాగర్తి రమేష్ రెడ్డి, వార్డు సభ్యులు లావణ్య లక్ష్మారెడ్డి, భవాని ధర్మస్వామి, పనాస రాజు, పంచాయతీ కార్యదర్శి శ్యామ్, పింఛన్ లబ్ధిదారులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.