లబ్ధిదారులకు పింఛన్ పత్రాలు అందజేత
తాడ్వాయి,నవంబర్,18( విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండల కేంద్రంలో బుధవారం పింఛన్ లబ్ధిదారులకు(Pension beneficiaries) నాయకులు పింఛన్ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు సంజీవులు(Congress Party Mandal President Bandaru Sanjeevulu) మాట్లాడుతూ.... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేదలందరికీ చేయూతనందించాలనే ఉద్దేశంతో అర్హులైన అందరికీ పింఛన్లు అందిస్తున్నారని తెలిపారు.
వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు, గీతా కార్మికులకు పెన్షన్లు అందించి ముఖ్యమంత్రి ఆసరాగా నిలుస్తున్నారని తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు(Yellareddy MLA K. Madan Mohan Rao) ఆదేశాల మేరకు లబ్ధిదారులకు పత్రాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయ రాములు,ఉప సర్పంచ్ రనిల్ రెడ్డి, నాయకులు వెంకట్రాంరెడ్డి,అంబీర్ శ్యాం రావు,శ్రీకాంత్, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.