కొడిశలగూడెం కార్డన్ సెర్చ్
దమ్మపేట, నవంబర్ 11(విజయ క్రాంతి): బుధవారం తెల్లవారుజామున, దమ్మపేట పోలీస్ స్టేషన్(Dammapeta Police Station) పరిధిలో గల కోడిశలగూడెం గ్రామం లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్ పి ఆదేశాల మేరకు, పాల్వంచ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సూచనల మేరకు అశ్వరావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి నాగరాజు(Inspector P. Nagaraju) ఆధ్వర్యంలో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కార్యక్రమం నిర్వహించినట్లు ఎస్ ఐ బి రాజేష్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా సి ఐ పి నాగరాజు గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం, ముఖ్యంగా గంజాయి సేవించడం, అక్రమ రవాణా, రోడ్డు భద్రత, సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం 52 ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించి 4 ద్విచక్ర వాహనాలకు జరిమానాలు విధించారు. 33 బైకులు, 04 ప్యాసింజర్ ఆటోలు, 01 ట్రాక్టర్ల వాహన పత్రాలు తనికీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట ఎస్ ఐ బి రాజేష్ కుమార్, దమ్మపేట పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.